రికార్డ్ సృష్టించిన IPL-2023..

IPL-2023 అత్యధికంగా 200 ప్లస్ లక్ష్య ఛేదనలు జరిగిన సీజన్‌గా చరిత్ర సృష్టించింది.

Update: 2023-05-08 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL-2023 అత్యధికంగా 200 ప్లస్ లక్ష్య ఛేదనలు జరిగిన సీజన్‌గా  రికార్డ్ సృష్టించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే (52 మ్యాచ్‌లు) 200 ప్లస్ లక్ష్యాలను 6 సార్లు విజయవంతంగా ఛేదించారు. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు. ఈ సీజన్‌లో ఇంకా 22 మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో.. ఈ సీజన్‌లో మరిన్ని విజయవంతమైన 200 ప్లస్‌ స్కోర్ల లక్ష్య ఛేదనలు జరిగే అవకాశం ఉంది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు 200 ప్లస్‌ లక్ష్యాలను ఛేదించగా.. రాజస్థాన్‌ రెండు సార్లు 200 ప్లస్‌ స్కోర్లను డిఫెండ్‌ చేసుకోలేకపోయింది. ఈ సీజన్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు (215) ముంబై, సన్‌రైజర్స్‌ పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక లక్ష్యాన్నిఛేదించిన రికార్డు (224) రాజస్థాన్‌ పేరిట ఉంది. 2020 సీజన్‌లో ఆ జట్టు పంజాబ్‌పై ఈ ఫీట్‌ను సాధించింది.

IPL-2023 సీజన్‌లో ఇప్పటివరకు 200 ప్లస్ నమోదైన మ్యాచ్‌లు ఇవే..

గుజరాత్ vs కేకేఆర్: గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ (చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 207/7) విజయం సాధించింది)

ఆర్సీబీ వర్సెస్ లక్నో: ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. స్టోయినిస్ (65) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడడంతో లక్నో వికెట్ (20 ఓవర్లలో 213/9) విజయం సాధించింది.

CSK vs పంజాబ్: CSK నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, ప్రభాసిమ్రాంసింగ్ (42) చెలరేగడంతో పంజాబ్ 4 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 201/6) గెలిచింది.

రాజస్థాన్ వర్సెస్ ముంబై: రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (55) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ముంబై 6 వికెట్ల తేడాతో (19.3 ఓవర్లలో 214/4) విజయం సాధించింది.

పంజాబ్ vs ముంబై: పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ (75) రాణించడంతో ముంబై 6 వికెట్ల (18.5 ఓవర్లలో 216/4) గెలిచింది.

రాజస్థాన్ vs సన్‌రైజర్స్: రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.. గ్లెన్ ఫిలిప్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 217/6) గెలిచింది.

Tags:    

Similar News