అతని వల్లే గెలిచాం.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోని

IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Update: 2023-05-24 12:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోనీ తమ విజయంపై స్పందించాడు. జడేజా సూపర్ బౌలింగ్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని చెప్పాడు. జడేజాకు ఈ కండిషన్స్‌కు సరిగ్గా సరిపోయాయి. అతని బౌలింగ్‌ను ఆడటం బ్యాటర్లకు కష్టమైందని.. అతని బౌలింగే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మొయిన్ అలీతో అతను నెలకొల్పిన భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది.

ఫాస్ట్ బౌలర్లకు తమ బలాలను నమ్ముకొని రాణించే వాతావరణాన్ని కల్పించాం. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాం. అద్భుతంగా బౌలింగ్ చేయాలని సూచించామని ధోని తెలిపాడు. రిటైర్మెంట్‌పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన ధోనీ.. ఇంకా 8-9 నెలల సమయం ఉందని.. అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. "వచ్చే సీజన్ ఆడటంపై ఇప్పుడే చెప్పలేను. సీజన్ వేలానికి ఇంకా 8-9 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఈ హెడెక్ ఎందుకు..? ఆడినా ఆడకున్నా.. సీఎస్‌కే‌కు నేను ఎప్పుడూ అండగానే ఉంటాను" అని ధోనీ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News