దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారు..? క్రికెట్ అభిమానుల మధ్య చాలా కాలంగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. అటు మీడియా వర్గాల్లోనూ ధోనీ రిటైర్మెంట్ ఇప్పుడు.. అప్పుడు అనే ప్రచారం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్ మినహా మిగిలిన అన్ని ఫార్మట్లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేశారు. IPL 2023లో భాగంగా ఆదివారం రాత్రి కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నైకి ఇదే చివరి మ్యాచ్. దీంతో జట్టు ఆటగాళ్లంతా మైదానంలో ఫ్యాన్స్‌కు బహుమతులు ఇస్తూ.. స్టేడియం మంతా తిరిగారు. కెమెరాల ఫోకస్ అంతా ధోనీపైనే కనిపించింది.
దీంతో ధోనీకి ఇదే చివరి సీజన్ అనే సందేహం అభిమానుల్లో కలిగింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై షేర్ చేసింది. ‘‘వచ్చే సీజన్‌లోనూ ధోనీ తప్పకుండా ఆడతాడనే నమ్మకం మాకుంది. అభిమానులు ఎల్లప్పుడూ మాకు ఇలానే మద్దతు కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. దీంతో కనీసం మరో సీజన్ అయినా ధోనీ ఆడుతాడంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A night of gratitude and infinite #Yellove #YellorukkumThanks #WhistlePodu 🦁💛 pic.twitter.com/1FTdgN7Z2c
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023