IPL 2023: విరాట్ కోహ్లీ అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో కోత..
స్టేడియంలో విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడు.
దిశ, వెబ్‌డెస్క్: స్టేడియంలో విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడు. అది మనందరికీ తెలిసిందే. అయితే అదే ఒక్కోసారి ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎస్‌కే బ్యాటర్ శివమ్ దూబే (26 బంతుల్లో 52 రన్స్) ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ చేసిన సంబరాలు శ్రుతి మించడంతో జరిమానా తప్పలేదు. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానా విధించినట్లు బీసీసీఐ ప్రకటించింది.
చెన్నై ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఔట్ అయినప్పుడు కోహ్లీ చాలా ఎగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన దూబే.. 17వ ఓవర్లో కూడా ఒక భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో కోహ్లీ ఎగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీని గురించే అతనికి ఫైన్ వేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.