IPL 2023: సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
IPL 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లలో పాటుగా 27 రన్స్ చేసిన భువీ.. ఐదు వికెట్ల, 25 ప్లస్ రన్స్ చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ ఘనతను సాధించిన జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా తొలి ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. జడేజా డెక్కన్ ఛార్జర్స్‌పై 48 పరుగులతో పాటు ఐదు వికెట్లు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు బంతితో భువీ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి ఓవర్లోనే ప్రమాదకర వృద్ధిమాన్ సాహా (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గిల్, సాయి కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సాయి అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య (8)ను భువీ ఎక్కువ సేపు క్రీజులో ఉండనివ్వలేదు. ఇక చివరి ఓవర్లో అయితే భువీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వేసిన ప్రతి బంతికీ వికెట్ తీసేలా కనిపించాడు. ఈ ఓవర్ తొలి బంతికే గిల్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే రషీద్ ఖాన్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతిని కనెక్ట్ చేయలేకపోయిన నూర్ అహ్మద్ (0) పరుగు తీసి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకునేందుకు ప్రయత్నించాడు.
IPL 2023: సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గాఈ సమయంలో క్లాసెన్ వేసిన బంతిని అందుకున్న భువీ.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను కూల్చాడు. దీంతో నూర్ అహ్మద్ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. మహమ్మద్ షమీ (0) ఆ మరుసటి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. దాన్ని బౌండరీ లైన్ వద్ద యాన్సెన్ సులభంగా అందుకోవడంతో షమీ కూడా గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. దీంతో భువీ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. వీటిలో మూడు వికెట్లు చివరి ఓవర్లోనే రావడం గమనార్హం. ఆ ఓవర్లో కేవలం రెండు పరుగలే చేసిన గుజరాత్ ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది.