IPL 2023: అదే రోహిత్ శర్మ వైఫల్యానికి కారణం.. హిట్ మ్యాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్

IPL 2023లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్నాడు.

Update: 2023-05-09 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 184 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 18.40 ఉండగా.. స్ట్రైక్‌రేట్‌ 126.89‌గా ఉంది. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమైన రోహిత్ చివరి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌లుగా వెనుదిరిగాడు. 2023 సీజన్‌లో రోహిత్ బ్యాటు నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే వచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

'రోహిత్ శర్మ మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. బౌలర్లతో కాకుండా తన వ్యక్తితత్వంతో ఆడుతున్నాడు. అతని ఆలోచనల్లో కాస్త గందరగోళం నెలకొంది. అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు. ఫామ్‌లోకి రావడానికి హిట్‌మ్యాన్‌కు ఒక్క ఇన్నింగ్స్ చాలు. అతను ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదు.' వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News