దిశ, వెబ్‌డెస్క్: RCB కెప్టెన్‌కి భారీ జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ ఓ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. RCB కెప్టెన్ డుప్లెసిస్‌కి రూ.12 లక్షల జరిమానా పడింది. లక్నోతో జరిగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్ సమయాన్ని డుప్లెసిస్ వృథా చేశాడు. దాంతో మ్యాచ్ జరుగుతుండగానే ఆర్సీబీకి ఒక పీల్డర్ని 30 యార్డ్ సర్కిల్లో అదనంగా ఉంచడం ద్వారా ఫీల్డ్ అంపైర్లు పనిష్మెంట్ ఇచ్చారు.
మ్యాచ్‌లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే బెంగళూరు టీమ్ ఒక ఓవర్‌ని తక్కువగా వేసింది. దాంతో లాస్ట్ ఓవర్‌కి వచ్చే సమయానికే ఆ విషయాన్ని గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు.. ఆర్సీబీకి పనిష్మెంట్ రూపంలో 30 యార్డ్ సర్కిల్ వెలుపల ఉన్న ఐదుగురు ఫీల్డర్లలో ఒకరిని సర్కిల్ లోపల ఉంచాల్సిందిగా డుప్లెసిస్‌ని ఆదేశించారు. లక్నో విజయానికి ఆఖరి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం.. ఆ సమయంలో 30 యార్డ్ సర్కిల్ వెలుపల ఒక ఫీల్డర్ని తగ్గించడం పెద్ద దెబ్బ.