IPL 2023: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..

IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Update: 2023-05-03 14:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ముంబై కంటే ఓ మెట్టు (ఆరో స్థానం) పైనున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఏకంగా రెండో స్థానానికి ఎగబాకుతుంది. ముంబై మాత్రం ఒకటి రెండు స్థానాలు మాత్రమే మెరుగుపరుచుకోగలుగుతుంది. ఓడితే మాత్రం కిందికి దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ముంబై జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన మెరిడిత్ స్థానంలో ఆకాశ్ మద్వాల్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో రబడ బెంచ్‌కు పరిమితమయ్యాడు.

ముంబై ఇండియన్స్:

రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, అర్షద్ ఖాన్

పంజాబ్ కింగ్స్:

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(సి), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Tags:    

Similar News