IPL 2023: చెలరేగిన ముంబై ఇండియన్స్.. లక్నో టార్గెట్ ఇదే

IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

Update: 2023-05-24 16:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్‌లో.. కామెరాన్‌ గ్రీన్‌ 41, సూర్యకుమార్‌ యాదవ్‌ 33, తిలక్‌ వర్మ 26 పరుగులు చేయగా.. ఆఖర్లో నిహాల్‌ వదేరా 12 బంతుల్లో 23 పరుగులు చేయడంతో ముంబై 180 పరుగుల మార్క్‌ను దాటింది. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ నాలుగు వికెట్లు తీయగా.. యష్‌ ఠాకూర్‌ మూడు, మొసిన్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

Tags:    

Similar News