ముంబై: ముంబై ఇండియన్స్ పేసర్ జై రిచర్డ్సన్ ఐపీఎల్-16 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ గురువారం స్పష్టం చేసింది. అలాగే, అతని స్థానంలో ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరిడిత్ జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. రిచర్డ్సన్ ఇటీవల తొడకండరాల గాయానికి సర్జరీ చేయించుకోవడంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. మినీ వేలంలో ముంబై ఫ్రాంచైజీ అతన్ని రూ. 1.50 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రిచర్డ్సన్ స్థానంలో ముంబై జట్టులోకి వచ్చిన మెరిడిత్ గతంలో పంజాబ్, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 13 మ్యాచ్‌ల్లో 9.0 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు.