IPL 2023: ఐపీఎల్లో మరో బిగ్ ఫైట్.. ముంబైతో గుజరాత్ ఢీ..
IPL 2023లో భాగంగా ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్‌లో ఉన్న గుజరాత్.. 3వ ప్లేస్‌లో ఉన్న ముంబైతో తలపడనుంది. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లో 8 గెలిచి.. 16 పాయింట్స్‌తో టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు ముంబై 11 మ్యాచ్‌లు ఆడగా.. 6 గెలిచింది.
ముంబై ఇండియన్స్ తుదిజట్టు (అంచనా):
రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (wk), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా):
వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ