IPL 2023: లక్నోను ఓడించే సత్తా ఆర్సీబీకి ఉందా..?

ఈ ఏడాది ఐపీఎల్‌ను ఆర్సీబీ ఘనంగా ప్రారంభించింది.

Update: 2023-04-10 10:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్‌ను ఆర్సీబీ ఘనంగా ప్రారంభించింది. ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో ఈ ఏడాదైనా ఆర్సీబీ కప్ కొడుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరమైన ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆలౌట్ అవడమే కాదు. కేవలం ముగ్గురు స్పిన్నర్లకే తొమ్మిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇప్పుడు లక్నోతో జరిగే మ్యాచ్‌లో కూడా ఇదే సమస్య ఆర్సీబీని వెంటాడుతోంది.

లక్నో ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. తాజాగా సన్‌రైజర్స్‌ను ఓడించిన ఆ జట్టు బలం కూడా స్పిన్నర్లే. రవి బిష్ణోయి, కృనాల్ పాండ్యా ఇద్దరూ ఆర్సీబీకి సమస్యగా మారే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌పై పాండ్యా ఎంతలా చెలరేగాడో అందరికీ తెలిసిందే. అలాగే కేఎల్ రాహుల్‌కు చిన్నస్వామి స్టేడియంలో ఆడటం కొత్తేం కాదు. అయితే గతేడాది లక్నో, బెంగళూరు జట్లు రెండు సార్లు తలపడగా.. రెండు సార్లూ విజయం ఆర్సీబీనే వరించింది.

దీంతో ఈ మ్యాచ్‌లో కూడా బెంగళూరు ఫేవరెట్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పుడు సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడేందుకు ఆర్సీబీ సిద్ధం అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచే సత్తా ఆర్సీబీకి ఉందా? అనేది అనుమానంగా మారింది. కానీ, ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆయా జట్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోనే ఫేవరెట్ అని చెప్పాలి. టీమ్‌లో కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు.

Tags:    

Similar News