IPL 2023: సన్‌రైజర్స్‌ టాప్ లేపిన కృనాల్ పాండ్యా.. లక్నో ముందు ఈజీ టార్గెట్..

IPL 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 121 రన్స్ చేసింది.

Update: 2023-04-07 15:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 121 రన్స్ చేసింది. ఆన్మోట్ ప్రీత్ సింగ్(31), రాహుల్ త్రిపాఠి(35), సుందర్(16), సమద్(21) రాణించారు. మయాంక్(8), కెప్టెన్ మార్‌క్రమ్ (0), బ్యూక్(3) ఘోరంగా విఫలమయ్యారు. జయ్‌దేవ్ ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన అబ్దుల్ సమద్, 10 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి హైదరాబాద్ స్కోరు 120 మార్కు దాటించాడు. లక్నో బౌలర్లలో.. కృనాల్ పాండ్యా 3, అమిత్ మిశ్ర 2, యశ్ ఠాకూర్, రవి బిష్ణాయ్ చెరో వికెట్ తీశారు.

Tags:    

Similar News