IPL 2023: 'కోహ్లీ-గంభీర్‌ యాడ్‌లో నటించాలి'.. సూచించిన లెజెండరీ ఆల్‌రౌండర్

లక్నో, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య మ్యాచ్ అనంతరం స్టేడియంలోనే గొడవ జరిగిన విషయం తెలిసిందే.

Update: 2023-05-05 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: లక్నో, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య మ్యాచ్ అనంతరం స్టేడియంలోనే గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవపై టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఓ సరదా సూచన చేశాడు. వీరిద్దరి మధ్య వ్యవహారం చల్లగా ఉండాలంటే.. కోహ్లీ, గంభీర్‌ ఓ శీతల పానీయం యాడ్‌కు సంతకం చేయాలని సూచించాడు. "యాడ్‌ ప్రమోషన్‌ కోసం గంభీర్‌, కోహ్లీల నుంచి సాఫ్ట్‌ డ్రింక్‌ సంతకం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. వారిని ఇది చల్లగా ఉంచుతుంది.. మీరేమంటారు?" అంటూ యువరాజ్ ఫన్నీ ట్వీట్‌ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

Tags:    

Similar News