IPL 2023: కేఎల్ రాహుల్ మరో ఘనత.. గేల్, కోహ్లీలు కూడా అతడి తర్వాతే..
IPL 2023: IPL 2023లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఘనత అందుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023: IPL 2023లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఘనత అందుకున్నాడు. గేల్, కోహ్లీల రికార్డులను బ్రేక్ చేశాడు. ఐపీఎల్ లో 4 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్, ఆర్సీబీ మాజీ ఆటగాడు డివిలియర్స్, విరాట్ కోహ్లీలు కూడా ఈ జాబితాలో రాహుల్ కంటే వెనుకే ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 30 పరుగులు దాటగానే ఐపీఎల్‌లో 105 ఇన్నింగ్స్‌లలోనే 4 వేల పరుగులు దాటిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
రాహుల్ కంటే ముందు ఈ ఘనత సాధించినవారిలో క్రిస్ గేల్ ముందున్నాడు. గేల్.. 112 ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకోగా డేవిడ్ వార్నర్ 114 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు. ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ.. 128 ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగుల క్లబ్ లో చేరగా.. ఏబీ డివిలియర్స్.. 131 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు.
𝕎𝕖 𝕃𝕠𝕧𝕖 𝕐𝕠𝕦 𝟜𝟘𝟘𝟘, Kaptaan Sahab 🫶🤩@klrahul | #LSGvPBKS | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/ZCjRS9mJmO
— Lucknow Super Giants (@LucknowIPL) April 15, 2023