దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సగం మ్యాచులకు దూరం అవుతాడని తేలిపోయింది. మడమ గాయంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా హాజిల్‌వుడ్ ఆడలేదు. స్వదేశం వెళ్లిపోయి అక్కడే చికిత్స తీసుకున్నాడు. దీంతో కనీసం మరో వారం పాటు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించి, బరిలో దిగే వీలుంటుంది. అంటే లీగ్ దశలో ఆర్సీబీ ఆడే 14 మ్యాచుల్లో అతను కనీసం ఏడు మ్యాచులకు మిస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరో ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ కూడా ఆర్సీబీ మొదటి మ్యాచ్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని మ్యాక్స్‌వెల్.. ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్‌లో కూడా అతను ఆడటం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్, బ్రేస్‌వెల్ ఇద్దరూ చెలరేగారు. దీంతో వీళ్లిద్దరూ తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.