IPL 2023: రాజస్తాన్ ఓపెనర్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా..
IPL 2023లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరుగుతున్న మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరుగుతున్న మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో 3 వేల పరుగుల మైల్ స్టోన్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ 52 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో 86 మ్యాచులాడిన బట్లర్.. 3,035 పరుగులు చేయగా.. అందులో 18 హాఫ్ సెంచరీలు.. 5 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇంగ్లీష్ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
ఈ మైల్ స్టోన్ అందుకున్న 21వ విదేశీ ఆటగాడిగా.. వేగంగా అందుకున్న మూడో బ్యాటర్‌గా నిలిచాడు. 85 ఇన్నింగ్స్‌ల్లోనే జాస్ బట్లర్ ఈ ఫీట్ అందుకున్నాడు. జాస్ బట్లర్ కంటే ముందు క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. క్రిస్ గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకుంటే.. కేఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా ఈ ఫీట్ అందుకునే సమయానికి బెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన రెండో బ్యాటర్ జాస్ బట్లర్. జాస్ బట్లర్ 151.08 స్ట్రైక్ రేట్‌తో మూడు వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. బట్లర్ కంటే ముందు డివిలియర్స్ 151.68 స్ట్రైక్ రేట్‌తో తొలి స్థానంలో ఉన్నాడు.
Milestone 🔓
— IndianPremierLeague (@IPL) April 12, 2023
3⃣0⃣0⃣0⃣ IPL runs & going strong 💪 💪
Well done, @josbuttler! 👏 👏
Follow the match ▶️ https://t.co/IgV0ZtiJJA#TATAIPL | #CSKvRR pic.twitter.com/W8h17R9Ezv