IPL 2023: ధోని ధమాకా.. జియోలో ఆల్ టైమ్ వ్యూయర్‌ షిప్

IPL 2023లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య చెపాక్‌లో ముగిసిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా రికార్డ్స్ బ్రేక్ చేసింది.

Update: 2023-04-13 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య చెపాక్‌లో ముగిసిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా రికార్డ్స్ బ్రేక్ చేసింది. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని సిక్సర్లకు జియో సినిమా వ్యూయర్‌షిప్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో 1 కోటి, కోటిన్నర వ్యూస్ ఉండగా ఆఖర్లో ధోని బ్యాటింగ్‌కు వచ్చి బాదుడు మొదలెట్టాక వ్యూయర్‌షిప్ ఏకంగా 2 కోట్లు దాటింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. జేసన్ హోల్డర్ వేసిన 19వ ఓవర్లో జడేజా ఓ ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి చెన్నైకి విజయం మీద ఆశలు కల్పించాడు. దీంతో జియో సినిమాలో చూసేవారి సంఖ్య కూడా 2 కోట్లకు పెరిగింది.

ఇక చివరి ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్. ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోని బ్యాటింగ్. ఆ ఓవర్లో 21 పరుగులు కావాలి. 2, 3 బంతుల్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడని భావించిన ఫ్యాన్స్ రాత్రి 11.30 గంటలు దాటినా మొబైల్ తెరల ముందు కళ్లప్పగించి చూశారు. అప్పుడు జియో వ్యూయర్ షిప్ ఏకంగా 2.2 కోట్లకు తాకింది. అయితే సందీప్ శర్మ చివరి మూడు బంతులను తెలివిగా వేసి చెన్నై విజయాన్ని దూరం చేశాడు. మ్యాచ్ పోయినా జియో వ్యూయర్ షిప్‌లో మాత్రం ఇవే హయ్యస్ట్ వ్యూస్.

జియో సినిమాలో IPL 2023 వ్యూస్‌ రికార్డు..

- సీఎస్కే vs రాజస్తాన్ : 2.2 కోట్లు

- ఆర్సీబీ vs లక్నో : 1.8 కోట్లు

- ముంబై vs ఢిల్లీ : 1.7 కోట్లు (లాస్ట్ ఓవర్ థ్రిల్లర్)

- సీఎస్కే vs లక్నో : 1.7 కోట్లు (ఇది కూడా ధోని.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టినప్పుడే)

- సీఎస్కే vs గుజరాత్ : 1.6 కోట్లు

Tags:    

Similar News