IPL 2023: 'నా ప్రదర్శన మా నాన్నకు అంకితం'.. మోహ్సిన్ ఖాన్

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మోహ్సిన్ ఖాన్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.

Update: 2023-05-17 14:47 GMT
IPL 2023: నా ప్రదర్శన మా నాన్నకు అంకితం.. మోహ్సిన్ ఖాన్
  • whatsapp icon

లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మోహ్సిన్ ఖాన్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. మంగళవారం ముంబైతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మోహ్సిన్ ఖాన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘నాకు ఇది కష్టతరమైన సమయం. గాయపడిన సంవత్సరం తర్వాత ఆడుతున్నాను. మా నాన్న గత 10 రోజులుగా హాస్పిటల్‌లోనే ఉన్నారు. నిన్ననే ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోసం నేను ఆడాను. నా ప్రదర్శన మా నాన్నకు అంకితం’ అని తెలిపాడు.

గత మ్యాచ్‌లో రాణించకపోయినప్పటికీ తనకు అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు మోహ్సిన్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో.. ముంబై ముందు 178 పరుగుల టార్గెట్ పెట్టింది. ఛేదనలో ముంబై విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమయ్యాయి. టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ క్రీజులో ఉండటంతో ముంబైదే విజయమని అంతా భావించారు. అయితే, అద్భుతంగా బౌలింగ్ చేసిన మోహ్సిన్ ఖాన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నోకు విజయాన్ని కట్టబెట్టాడు.

Tags:    

Similar News