దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ముంబై ఇండియన్స్ తరఫున హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. సూపర్ స్ట్రైక్ రేట్‌తో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దుమ్ము రేపాడు తిలక్. తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌లో ముంబైకు మొదటి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 29 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, 4 సిక్స్‌లు ఉండడం గమనార్హం. ముఖ్యంగా ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు తిలక్. వరుసగా ఫోర్, రెండు సిక్స్‌లు బాది గెలుపును ముంబైకు మరింత చేరువ చేశాడు.
మరో మ్యాచ్‌లో బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో తిలక్ ఆడిన ఇన్నింగ్స్‌ను అంత ఈజీగా మర్చిపోలేం. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో వర్మ 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తానికి ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన తిలక్ 147 పరుగులు చేశాడు. టోర్నీలో ముంబై తరపున టాప్‌స్కోరర్‌గా వర్మనే కొనసాగుతున్నాడు. మొత్తానికి ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ క్రికెటర్లు తిలక్ బ్యాటింగ్‌కు ముగ్ధులవుతున్నారు.
WOW!
— IndianPremierLeague (@IPL) April 11, 2023
Two excellent shots to produce the same result 😎
Tilak Varma departs not before smacking a quick-fire 41 off 29!#TATAIPL | #DCvMI pic.twitter.com/EmiLdpyyc0