IPL 2023: గుజరాత్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు..

IPL 2023లో భాగంగా రాజస్తాన్‌తో జరిగన మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు సాధించాడు.

Update: 2023-04-16 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్‌తో జరిగన మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 2 వేల పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా చోటు సంపాదించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో పాండ్యా ఈ ఘనత సాధించాడు. 111 మ్యాచ్‌లు ఆడిన పాం‍డ్యా 2,012 పరుగులు సాధించాడు. 29 ఏళ్ల 187 రోజుల్లో 2వేల మార్క్‌తో పాటు 50 వికెట్లు తీసుకున్న పాండ్యా.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

అంతకంటే ముందు షేన్‌ వాట్సన్‌(3,874 పరుగులు, 92 వికెట్లు, 32 ఏళ్ల 330 రోజులు), కీరన్‌ పొలార్డ్‌(3,412 పరుగులు, 69 వికెట్లు, 29 ఏళ్ల 332 రోజులు), రవీంద్ర జడేజా(2,531 పరుగులు, 138 వికెట్లు, 31 ఏళ్ల 301 రోజులు), జాక్‌ కలిస్‌(2,427 పరుగులు, 65 వికెట్లు, 37 ఏళ్ల 177 రోజులు), ఆండ్రీ రసెల్‌(2,074 పరుగులు, 92 వికెట్లు, 34 ఏళ్ల 15 రోజులు) ఈ ఘనత అందుకున్నారు.

Tags:    

Similar News