IPL 2023: కీలక పోరుకు ముందు సచిన్‌ను కలిసిన విరాట్ కోహ్లీ..

Update: 2023-05-09 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలకమైన మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికకానుంది. అయితే ప్లేఆఫ్స్ చేరే చివరి రెండు స్థానాల కోసం చాలా జట్లు పోటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పదేసి పాయింట్లతో ఉండటంతో టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు ముంబై మెంటార్ సచిన్ టెండూల్కర్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కలిశారు. ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను షేర్ చేసిన ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్.. '5,9679 పరుగులు.. 175 అంతర్జాతీయ శతకాలు.. లక్షల జ్ఞాపకాలు.. అన్నీ ఒకే ఫ్రేమ్‌లో' అని క్యాప్షన్ తగిలించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో క్రికెట్ దేవుడు, కింగ్ కలిసి కనిపిస్తున్నారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News