ఐపీఎల్ 2024: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు సన్‌రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు సన్‌రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ మొదట బౌలింగ్ చేయనుంది. ఇదిలా ఉంటే కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకోవడం కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ లో హైదరాబాద్ గెలిచిన అత్యధిక మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసి.. భారీ స్కోరు చేసింది. ఈ రోజు కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. రాజస్థాన్ జట్టు విజయ పరంపరకు ఆరెంజ్ ఆర్మీ బ్రేక్ వేసే అవకాశం ఉంది. హైదారబాద్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ వెంట వెంటనే అవుట్ కావడంతో గత రెండు మ్యాచుల్లో స్కోర్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. కాగా ఈ మ్యాచులో అయిన ఓపెనింగ్ జంట విజృంబిస్తుందని, సొంత గ్రౌండ్ లో మరోసారి సంచలన స్కోర్ నమోదు కావాలని సన్ రైజర్స్ అభిమాను వేచి చూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆల్ రౌండర్లను సన్ రైజర్స్ జట్టులోకి తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(w), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(c), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్