ఐపీఎల్ 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు 27వ మ్యాచ్ పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరగనుంది. చండీఘర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు 27వ మ్యాచ్ పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరగనుంది. చండీఘర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్ లో ఓటమి చవి చూడగా ఈ సారి విజయం కోసం వేచి చూస్తున్నాయి. పాయింట్ల పట్టికలో ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు ఈ మ్యాచులో గెలిచి తమ స్థానాన్ని పదిలం చేసుకొవాలని చూస్తుంది.
అలాగే పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి పోటీలో నిలవాలని చూస్తుంది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు గుజరాత్ మ్యాచులో 200 పరుగుల లక్ష్యాన్ని చేదించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఈ మ్యాచులో రాజస్థాన్ జట్టు పై పంజాబ్ జట్టు ఎంతమేరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కేశవ్ మహరాజ్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ