క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక నా గోల్ అదే : కుల్దీప్ యాదవ్

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫుట్‌బాల్ టీమ్‌కు మేనేజర్‌గా వ్యవహరించాలనుకుంటున్నట్టు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు.

Update: 2024-04-30 13:10 GMT

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫుట్‌బాల్ టీమ్‌కు మేనేజర్‌గా వ్యవహరించాలనుకుంటున్నట్టు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. కుల్దీప్‌‌కు ఫుట్‌బాల్ ఆట అంటే ఇష్టం. గతంలో ఎన్నోసార్లు బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌కు మద్దతు పలికాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌ సమయంలో భారత్‌కు వచ్చిన ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్‌ను కూడా కలుసుకున్నాడు.

తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో కుల్దీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘నా కెరీర్ పూర్తయిన తర్వాత ఫుట్‌బాల్ మేనేజర్‌గా ప్రయత్నించాలనుకుంటున్నా. ఈ విషయాన్ని బెక్‌హామ్‌కు కూడా తెలియజేశా. అలాగే, భవిష్యత్తులో భారత ఫుట్‌బాల్ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. మనకు ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నారు. కానీ, వారికి పూర్తిగా వనరులు అందడం లేదు. కాబట్టి, ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు చేయడమే నా లక్ష్యం.’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున కుల్దీప్ సత్తాచాటుతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. దీంతో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే భారత జట్టులోనూ అతనికి చోటు దక్కింది. 

Tags:    

Similar News