కష్టాలు, త్యాగాలు వంటి పదాలు వాడను : విరాట్ కోహ్లీ

తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డానని, ఎన్నో త్యాగాలు చేశానని చెప్పుకోనని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు.

Update: 2024-04-20 16:10 GMT

దిశ, స్పోర్ట్స్ : తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డానని, ఎన్నో త్యాగాలు చేశానని చెప్పుకోనని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో విరాట్ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘నిజాయతీగా చెబుతున్నా. నేను ఎలాంటి కష్టాలు పడలేదు. ఎలాంటి త్యాగం చేయలేదు. నాకు నచ్చింది చేస్తున్నా. ఒక్క రోజులో రెండు పూటల భోజనం పొందని వాడు కష్టపడుతున్నట్టు. నేను ఎప్పటి నుంచే ఇష్టపడిన పనినే చేస్తున్నాను. అందుకే ఇక్కడ ఉన్నా. నేను క్రికెట్ ఆడతాను. అది నా వృత్తి. జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచిస్తే నేను పడ్డ కష్టాలు కష్టాలే కావు.’ అని కోహ్లీ తెలిపాడు. కాగా, ఐపీఎల్-17లో బెంగళూరు తరపున విరాట్ అదరగొడుతున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేసిన అతను ప్రస్తుతం టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. 

Tags:    

Similar News