ఆ విషయంలో సంతోషంగా లేను : రషీద్ ఖాన్

స్పిన్ మంత్రంతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించే గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదు.

Update: 2024-04-16 13:21 GMT

దిశ, స్పోర్ట్స్ : స్పిన్ మంత్రంతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించే గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో 7.96 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన రషీద్ ఖాన్.. తన ప్రదర్శనపై సంతోషంగా లేనని తెలిపాడు. ‘శస్త్ర చికిత్స కారణంగా తొలి మూడు గేముల్లో ఇబ్బంది పడ్డాను. తిరిగి ఫామ్ అందుకోవడం అంత సులభం కాదు. అయితే, చివరి రెండు గేమ్‌ల్లో నేను సంతోషంగా ఉన్నాను. నా శరీరం ఎలా అనుమతించిందో అలాగే బౌలింగ్ చేశాను. కానీ, వికెట్ల విషయంలో నేను సంతోషంగా లేను. టీ20 క్రికెట్‌లో మీరు పోషించే చిన్న పాత్ర కూడా జట్టు విజయానికి సహాయపడుతుంది. ఆ చిన్న పాత్ర కోసం కూడా నా వంతు ప్రయత్నిస్తాను. చివరి 8 మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు తీయడానికి కృషి చేస్తాను.’ అని చెప్పాడు. కాగా, నేడు ఢిల్లీతో గుజరాత్ తలపడనుంది.

Tags:    

Similar News