IPL ఫైనల్ వేళ భారీ వర్షం..విన్నర్‌ను ఇలా నిర్ణయిస్తారు

ఐపీఎల్ ఫైనల్ వేళ గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. ఈ రోజు సాయంత్రం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Update: 2023-05-28 02:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఫైనల్ వేళ గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. ఈ రోజు సాయంత్రం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తుంది. అయితే ప్రతీష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కావడంతో.. రిజర్వ్ డే ను కూడా అందుబాటులో ఉంచారు. అయితే.. సోమవారం కూడా భారీ వర్ష సూచన ఉండటంతో.. IPL 2023 ఫైనల్ వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. సోమవారం అయినా వర్షం కాస్త కనికరించిన ఐదు ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే.. సూపర్ ఓవర్ ద్వారా విజేతలు ఎవరనేది నిర్ణయిస్తారు. ఇది ఇది తెల్లవారుజామున 1.20 గంటలకు ప్రారంభమవుతుంది. చివరికి ఇవేవి సాధ్యం కాకపోతే.. లీగ్ పట్టికలో అత్యధిక స్థానంలో నిలిచినందుకు GT విజేతగా ప్రకటించబడుతుంది.

Tags:    

Similar News