మరోసారి హర్షిత్ రానా ఓవరాక్షన్.. ఒక మ్యాచ్ నిషేధం

ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా జరుగుతుంది. ఈ సీజన్ లో పదుల సంఖ్యలో కొత్త ప్లేయర్లు తమ సత్తాను చాటుతున్నారు. కాగా కొంత మంది యువ ప్లేయర్లు కొంతమంది ఓవరాక్షన్ చేస్తూంటారు.

Update: 2024-04-30 13:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా జరుగుతుంది. ఈ సీజన్ లో పదుల సంఖ్యలో కొత్త ప్లేయర్లు తమ సత్తాను చాటుతున్నారు. కాగా కొంత మంది యువ ప్లేయర్లు కొంతమంది ఓవరాక్షన్ చేస్తూంటారు. ఈ క్రమంలోనే బీసీసీఐ మార్చిన రూల్స్ అలాంటి వారికి షాక్ ఇస్తున్నాయి.ఇందులో భాగంగానే కలకత్తా యువ బౌలర్ హర్షిత్ రానా తీరు చర్చనీయాంశంగా మారింది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో సినియర్ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్‌ ను అవుట్ చేసిన ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో అతనికి మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు.. తాజాగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచులోను ఇలానే చేశాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తన ఒక మ్యాచ్ ఫీజు మొత్తం జరిమానా విధించింది. దీంతో పాటుగా ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది.


Similar News