మరి కాసేపట్లో IPL ఫైనల్ మ్యాచ్.. వెదర్ కండిషన్‌పై వాతావరణ శాఖ కీలక ప్రకటన..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో ఆఖరి పోరుకు సమయం ఆసన్నమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో ఆఖరి పోరుకు సమయం ఆసన్నమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఫైనల్ పోరు మొదలుకానుంది. ఇక, బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో ఏ జట్టు గెలుస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు చెరో రెండు టైటిల్స్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్.. ముచ్చటగా మూడో టైటిల్‌పై కన్నేశాయి. మరీ 2024 ఐపీఎల్ సీజన్ విజేత ఎవరో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. అయితే, ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాలు ముందు చెపాక్ స్టేడియం వద్ద వెదర్ కండిషన్‌పై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. చెపాక్ స్డేడియం వద్ద ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ.. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని వెల్లడించింది. ఈ వార్త విని ఐపీఎల్ ప్రియులు ఆనందపడుతున్నారు. అయితే, వర్షం కారణంగా ఇవాళ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోయిన రిజర్వ్ డే ఉండటంతో రేపు నిర్వహించనున్నారు.