ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ షాక్.. అత్యంత కీలక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసిన బీసీసీఐ
ఐపీఎల్ 2024 సీజన్ లోని కీలక ప్లేయర్లకు బీసీసీఐ భారీ షాక్‌లు ఇస్తుంది. గత సీజన్ తో పోలిస్తే ఈ సారి రూల్స్ ను కఠినతరం చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ లోని కీలక ప్లేయర్లకు బీసీసీఐ భారీ షాక్‌లు ఇస్తుంది. గత సీజన్ తో పోలిస్తే ఈ సారి రూల్స్ ను కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన 56వ మ్యాచులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్ కు షాక్ ఇచ్చింది. స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు పంత్ కు ఇప్పటికే రెండు సార్లు జరిమానా విధించిన బీసీసీఐ తాజాగా మరోసారి అలాగే జరగడంతో అతనికి 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది. అలాగే ఢిల్లీ జట్టులోని 10 మంది ప్లేయర్లకు ఒక్కొక్కరికి 12 లక్షల, వారి సంబంధిత మ్యాచ్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది జరిమానా విధించబడింది. దీంతో ఈ రోజు బెంగుళూరుతో జరిగే అత్యంత కీలకమైన మ్యాచులో పంత్ ఆడటం లేదు. కాగా ఇరు జట్లకు ఈ మ్యాచ్ ప్లే ఆఫ్ చేరేందుకు అత్యంత కీలకం కావడం విశేషం.