వెన్నుపోటు పొడిచావు.. నిన్ను నమ్ముతానా? : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌పై దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్‌పై టీమ్ ఇండియా వికెట్ కీపర్ దీనేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Update: 2024-04-09 19:38 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్‌పై టీమ్ ఇండియా వికెట్ కీపర్ దీనేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా స్కై స్పోర్ట్స్ పాడ్ కాస్ట్‌లో వీరిద్దరు పాల్గొన్నారు. ఐపీఎల్-17లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపులో కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. 10 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ పాడ్ కాస్ట్‌లో నాజర్ దీన్ని ప్రస్తావిస్తూ అద్భుతంగా ఆడావని కార్తీక్‌ను ప్రశంసించాడు. అలాగే, టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో భాగమవుతాడని చెప్పాడు. దీనికి కార్తీక్ స్పందిస్తూ నాజర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నాజర్ హుస్సేన్ చెప్పే మాటలను నేను నమ్మను. నన్ను ఓ వ్యక్తిగా, ఓ ఆటగాడిగా, వికెట్‌కీపర్‌గా నువ్వు ఇష్టపడవు. గతేడాది వరల్డ్ కప్‌ జట్టులో నేను ఉండకూడదని చెప్పిన ఏకైక వ్యక్తివి నువ్వు. నన్ను ఇంటర్వ్యూ చేశావు. వెన్నుపోటు పొడిచావు. రిషబ్ పంత్ ఎక్కడా అంటూ హెడ్‌లైన్స్ వేశావు. నాతో మంచిగా ఉన్నట్లు ప్రయత్నించకు.’ అని కార్తీక్ తెలిపాడు.

Tags:    

Similar News