ఇది నా కెరీర్‌లో చివరి దశ: ఎంఎస్ ధోని
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన IPL 2023 మ్యాచ్‌లో CSK ఏడు వికెట్ల తేడాతో SRH ని ఓడించిన తర్వాత, MS ధోని ప్రెజెంటేషన్ వేడుకలో ఇలా అన్నాడు. నేను ఖచ్చితంగా పెద్దవాడిని అయ్యాను.. ఈ విషయంలో ఎవరు కూడా నిజంగా సిగ్గుపడలేరు. అన్ని అన్నారు. అలాగే " ఇది నా కెరీర్ లో చివరి దశ.. ఎంతకాలం ఆడినా.. ఐపీఎల్‌ను ఆస్వాదించడమే ముఖ్యమని ధోని చెప్పుకొచ్చాడు. అయితే గత కొంత కాలంగా ధోని మొత్తం క్రికెట్ కు దూరం కాబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో ధోని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన ఫ్యాన్స్ ను ఆందోళన లోకి నెట్టింది. ధోని మాటలు వింటుంటే.. వచ్చే సీజన్ లో ఆయన ఆడటం కష్టంగానే కనిపిస్తుంది.