చెన్నయ్‌కు షాక్.. ఆ స్టార్ బౌలర్ ఔట్?
ఐపీఎల్-17లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలేలా కనిపిస్తున్నది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలేలా కనిపిస్తున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ మిగతా మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 1న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ గాయపడ్డాడు. కేవలం రెండు బంతులు మాత్రమే వేసి మైదానం వీడాడు. తొడ కండరాల గాయం కారణంగా అతను ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.
గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.నేడు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు చాహర్ అందుబాటులో ఉండటం లేదు. ఆ మ్యాచ్ కోసం అతను ధర్మశాలకు వెళ్లలేదని, చెన్నయ్‌లో ఉన్నాడని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. చాహర్ పరిస్థితి బాగా లేదన్నాడు. అతను లీగ్‌కు దూరమయ్యాడని కచ్చితంగా చెప్పలేనని, కానీ అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. సీఎస్కే సీఈవో వ్యాఖ్యలను బట్టి చాహర్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన చాహర్ 5 వికెట్లు పడగొట్టాడు.