IPL 2024 : చెలరేగిన చెన్నయ్ బౌలర్లు.. కోల్‌కతా స్కోరు 137/9
ఐపీఎల్-17లో వరుసగా రెండు పరాజయాలు చూసిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తున్నది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో వరుసగా రెండు పరాజయాలు చూసిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తున్నది. చెన్నయ్ వేదికగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ దిశగా తొలి ఇన్నింగ్స్‌లో చెన్నయ్ జట్టు సత్తాచాటింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో కోల్‌కతా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన చెన్నయ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నయ్ బౌలర్ల ధాటికి కోల్‌కతా ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన 34 పరుగులే టాప్ స్కోర్. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్(27), రఘువంశీ(24), వెంకటేశ్ అయ్యర్(3)తోపాటు రింకు సింగ్(9), రస్సెల్(10) నిరాశపరిచారు. చెన్నయ్ బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే మూడేసి వికెట్లతో కోల్‌కతాను కట్టడి చేశారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండు వికెట్లు, తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు.