స్టోక్స్ మరో వారం ఆటకు దూరం
చెన్నయ్ సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ గాయం బారిన పడటం చెన్నయ్ జట్టులో ఆందోళన కలిగిస్తున్నది.
చెన్నయ్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ గాయం బారిన పడటం చెన్నయ్ జట్టులో ఆందోళన కలిగిస్తున్నది. సీఎస్కే ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో స్టోక్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లోనూ అతను పెద్దగా ప్రభావం చూపలేదు. అనంతరం మోకాలి గాయంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. శుక్రవారం హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు స్టోక్స్ గాయం నుంచి కోలుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టిందట. దాంతో రేపు కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌కు సైతం స్టోక్స్ అందుబాటులో ఉండటం లేదు.
ఈ విషయాన్ని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ‘స్టోక్స్‌కు గాయం తిరబెట్టింది. గాయం పెద్దదేమీ కాకపోయినప్పటికీ.. తిరగబెట్టడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాంతో అతను మరో వారం రోజులపాటు అందుబాటులో ఉండడు’ అని చెప్పాడు. అలాగే, ధోనీ మోకాలి గాయంపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ఇప్పుడు అతను ఫిట్‌గానే ఉన్నాడని, అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. కాగా, గతేడాది మినీ వేలంలో స్టోక్స్‌ను చెన్నయ్ జట్టు రూ.16.25 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.