చెన్నై ఓటమికి కారణం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ గైక్వాడ్

చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్ ఓవర్ వరకు నరాలు

Update: 2024-04-24 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్ ఓవర్ వరకు నరాలు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జైయింట్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో స్టార్ ఆల్ రౌండర్ స్టోయినిస్ అద్భుత ప్రదర్శనతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం దక్కిందుకుంది. ఈ క్రమంలో చెన్నై ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం గైక్వాడ్ మాట్లాడుతూ.. మ్యాచ్ 13, 14 ఓవర్ల వరకు మా చేతిలోనే ఉంది. కానీ స్టోయినిస్ క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. స్టోయినిస్ అద్భుత ఇన్సింగ్‌తోనే తమ జట్టు ఓడిపోయిందని గైక్వాడ్ ఒప్పుకున్నాడు.

ఒత్తిడిలో కూడా స్టోయినిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండటంతో తమ జట్టు స్పిన్నర్లకు బంతిపై పట్టు దొరకలేదని.. లేదంటే మ్యాచ్ ఫలితం మరొలా ఉండేదని పేర్కొన్నాడు. ఈ మ్యా్చ్‌లో మరో 20 పరుగులు అదనంగా చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆటలో గెలుపు ఓటములు సహజమని.. ఈ మ్యాచ్‌ మాత్రం అద్భుతంగా సాగిందని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. కెప్టెన్ ఇన్సింగ్ ఆడి సీఎస్కే భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశాడు. అయినప్పటికీ స్టోయినిస్ అద్భుత సెంచరీతో లక్నో గెలవడంతో.. గైక్వాడ్ సెంచరీ వృధా అయ్యింది. 


Similar News