ఐపీఎల్ వేళ తెలుగు ఫ్యాన్స్‌కు BCCI గుడ్ న్యూస్
ఐపీఎల్-2024 షెడ్యూల్ విడుదల కావడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్ బెంగళూరు, చెన్నై మధ్య పెట్టడంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయింది.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024 షెడ్యూల్ విడుదల కావడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్ బెంగళూరు, చెన్నై మధ్య పెట్టడంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయింది. దీంతో ఎప్పుడెప్పుడు సీజన్ ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంతో పాటు ఈ సారి విశాఖలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో రెండు మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, మార్చి 22వ తేదీన ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే బీసీసీఐ రిలీజ్ చేసింది. మార్చి 22వ తేదీన CSK, RCB జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. 23వ తేదీన కోల్‌కతా జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 7వ తేదీన లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరుగనుంది. అయితే, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారులు, పోలీసులు అంతా ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగే మైదానాల్లో భద్రతా కోసం పోలీసుల అవసరం ఉంటుంది. అందుకే ఎన్నికల తర్వాత మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.