అంపైర్ తో వాగ్వాదం.. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది.

Update: 2024-05-08 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో రాజస్థాన్ కెప్టెన్ సంజు అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో అతను అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీసీసీఐ RR కెప్టెన్ సంజు శాంసన్ IPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించింది. కాగా ఇది అతనికి ఇది రెండో పెద్ద జరిమానా కావడం విశేషం. ఏప్రిల్ 10న జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు RR కెప్టెన్‌కి రూ. 12 లక్షల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే.

అసలేం జరిగిందంటే..

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో RR 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. తమ జట్టు వరుస వికెట్లు కోల్పోతున్నప్పటికి సంజూ దీటుగా ఆడుతు.. 86 పరుగులతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో ముఖేశ్ కుమార్ వేసిన 16 వ ఓవర్ లో నాలుగో బంతిని శాంసన్ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న షై హోప్ సరిగ్గా బౌండరీ లైన్ కు అంగుళాల దూరంలో క్యాచ్ పట్టాడు. ఆ సమయంలో అతను కాస్త అదుపుతప్పి బౌండరి లైన్ వైపు అడుగులు వేశాడు. దీంతో అంతా సంజూ నాటౌట్ అనుకున్నారు. కానీ థర్డ్ అంపైర్.. క్షుణ్ణంగా పరీక్షించి అవుట్ గా ప్రకటించాడు. అయినప్పటికి సంజూ మరోసారి థర్డ్ అంపైర్ కు రివ్యూ కోరుతూ.. ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదం చేశాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు.. అతని ఫీజులో 30 కోత విధించారు. అలాగే మరోసారి ఇలా జరిగితే ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలిసింది.


Similar News