టీమ్ ఇండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్..

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-05-22 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు బైజూస్ సంస్థ భారత జట్టుకు కిట్‌ను స్పాన్సర్‌ చేస్తుండగా.. ఇకపై ఆ స్ధానంలో అడిడాస్‌ కిట్స్‌ను అందించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు.

"టీమ్ఇండియా కిట్ స్పాన్సర్‌గా బీసీసీఐ 'అడిడాస్'తో ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే ప్రముఖ స్పోర్ట్స్ వస్తువుల బ్రాండ్​లో ఒకటైన అడిడాస్​తో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. క్రికెట్‌ క్రీడ అభివృద్ధికి మేము ఎల్లప్పుడు కట్టుబడి ఉంటాము. వెల్‌కమ్‌ అడిడాస్‌" అని జై షా ట్వీట్‌ చేశారు.

అయితే టీమ్​ఇండియాకు ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ 2020 నుంచి 2023 డిసెంబర్‌ వరకు భారత జట్టుకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించాల్సి ఉంది. గతేడాది డిసెంబరులో ఎంపీఎల్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి తాత్కాలికంగా కిల్లర్​ జీన్స్​ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ నెల 31తో ఆ ఒప్పందం ముగియనుంది.

Tags:    

Similar News