IPL 2023: పంజాబ్ ట్వీట్‌కు ముంబై పోలీస్ రిప్లే..
ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ముంబై: ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 16 పరుగులు కావాల్సి ఉండగా.. అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయడంతోపాటు రెండు పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అర్ష్‌దీప్ ఆ ఓవర్‌లో వరుస బంతుల్లో తిలక్ వర్మ, నేహాల్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. రెండుసార్లు వికెట్ విరిగిపోవడం గమనార్హం. దాంతో వికెట్ విరిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై ఆదివారం పంజాబ్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ సరదా ట్వీట్ చేసింది. అర్ష్‌దీప్ సింగ్ వికెట్లను విరగొట్టడాన్ని క్రైమ్‌తో పోలుస్తూ..‘హే ముంబై పోలిస్.. మేం ఓ క్రైమ్ గురించి రిపోర్టు చేయాలనుకుంటున్నాం’ అంటూ వికెట్ విరిగిపోయిన ఫొటోను పోస్టు చేసింది. దీనిపై ముంబై పోలిస్ టెక్నికల్ విభాగం కూడా స్పందించింది. ‘చట్టాలను బ్రేక్ చేస్తేనే చర్యలుంటాయి.. స్టంఫ్స్‌ను కాదు’ అని సరదాగా బదులు ఇచ్చింది.
Like Addhar for Indian citizens, trophy is mandatory for IPL franchise to report a FIR. https://t.co/Ra2WY4RywD
— Mumbai Police (@MumbaiPolicee) April 22, 2023