ముంబైతో మ్యాచ్ ముందు చెన్నై జట్టుకు షాక్
ఐపీఎల్ 2024లో భాగంగా ఈ రోజు రాత్రి ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ ముందు చెన్నై జట్టుకు భారీ షాక్ తగిలింది.
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా ఈ రోజు రాత్రి ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ ముందు చెన్నై జట్టుకు భారీ షాక్ తగిలింది. చెన్నై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఫాస్ట్ బౌలర్ పతిరణ మరోసారి మ్యాచ్ కు దూరం అయ్యారు. గాయం కారణంగా ఇప్పటికే రెండు మ్యాచులు దూరం అయని అతను ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత మళ్లి గాయపడినట్లు తెలుస్తుంది. ఈక్రమంలో ఈ రోజు ముంబై జట్టుతో జరిగే మ్యాచ్లో పతిరాణ ఆడటం లేదని.. చెన్నై బౌలింగ్ కోచ్.. ప్లెమింగ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పతిరాణ గాయం అంత పెద్దది కాదని.. కానీ.. అతనికి కొంచెం విశ్రాంతి అవసరం కాబట్టి ఒక మ్యాచ్ రెస్ట్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే తదుపరి మ్యాచులో తిరిగి ఆడతాడని చెప్పుకొచ్చారు. అయితే అతనికి వరుస గాయలు అవుతుండటంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. శ్రీలంక జట్టులో అత్యంత కీలక బౌలర్ గా ఎదిగిన అతను గాయాలతో త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు దూరమైతే జట్టు ఇబ్బందులో పడుతుందని, అలాగే అతని కెరీర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే చాన్స్ ఉందనే బయంలో ఉన్నట్లు తెలుస్తుంది.