సాకులు చెప్పే బ్యాచ్ కాదు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీ20 వరల్డ్ కప్‌లో తమ నైపుణ్యాలు, జట్టుగా తమకు ఏం కావాలో అనే విషయాలపైనే ఫోకస్ పెట్టినట్టు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

Update: 2024-06-18 16:36 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో తమ నైపుణ్యాలు, జట్టుగా తమకు ఏం కావాలో అనే విషయాలపైనే ఫోకస్ పెట్టినట్టు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా రోహిత్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియో రోహిత్ సూపర్-8 రౌండ్ కోసం జట్టు సన్నద్ధత గురించి మాట్లాడాడు. ‘‘జట్టులో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఆడాలనుకుంటున్నారు. అందుకోసం నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి శ్రమిస్తున్నారు. విండీస్‌లో మేము చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి, విజయం కోసం ఏం చేయాలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆటగాళ్లందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.’ అని తెలిపాడు.

అలాగే, స్వల్ప వ్యవధిలోనే భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడంపై రోహిత్ పరోక్షంగా ఐసీసీపై విమర్శలు చేశాడు. ‘సూపర్-8 రౌండ్‌లో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత 3-4 రోజుల వ్యవధిలోనే మిగతా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇది కాస్త హడావుడిగా ఉంది. కానీ, మేము వాటికి అలవాటు పడ్డాం. చాలా ట్రావెల్ చేస్తాం. చాలా ఆడతాం. కాబట్టి, వీటిని మేము సాకులుగా చెప్పం. మా ఫోకస్ అంతా మా నైపుణ్యాలు, జట్టుగా మాకు ఏం కావాలి అనే దానిపైనే ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. 


Similar News