ఉత్కంఠ పోరులో నేపాల్ పై సౌతాఫ్రికా విజయం!

ఉత్కంట భరిత పోరులో నేపాల్ పై సౌతాఫ్రికా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Update: 2024-06-15 07:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్కంట భరిత పోరులో నేపాల్ పై సౌతాఫ్రికా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్- డీ లోని నేపాల్ సౌతాఫ్రికా దేశాలు తలపడ్డాయి. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో రిజా హెండ్రిక్స్ మాత్రమే 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నేపాల్ బౌలర్లు కుశల్ (4/19), దీపేంద్ర సింగ్ (3/21) ఉత్తమ ప్రదర్శన చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నేపాల్ మొదటగా వికెట్లు పడకుండా జాగ్రత్త పడింది. 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసిన నేపాల్ చివరి బంతి వరకు పోరాడి సౌతాఫ్రికాకు చుక్కలు చూపించింది.

చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. సౌతాఫ్రికా బౌలర్ బార్ట్ మన్ తెలివితో స్లో పిచ్ బాల్ వేసి నేపాల్ బ్యాటర్ గుల్సన్ ఝాను బోల్తాకొట్టించాడు. చివరికి ఒక పరుగు తీసి టై చేద్దామని ప్రయత్నించినా.. రనౌట్ కావడంతో సౌతాఫ్రికా గెలిచింది. నేపాల్ బౌలర్లలో ఓపెనర్ ఆసిఫ్ షేక్ 42 పరుగులు చేయగా మరో బ్యాట్స్ మన్ అనిల్ షా 27 పరుగులతో రాణించారు. గ్రూప్-డీ లో ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి సూపర్-8 కు చేరుకున్న సౌతాఫ్రికాకు నాలుగో విజయం వరించింది.


Similar News