ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి మృతి.. వయసేంతో తెలిస్తే షాక్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా వెనెజులాకు చెందిన జువాన్ తాజాగా మరణించారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా వెనెజులాకు చెందిన జువాన్ తాజాగా మరణించారు. ఈయన 1909 మే 27 వ తారీకున ఆండియన్ రాష్ట్రంలోని టాచిరాలోని ఎల్కోబ్రే పట్టణంలో జన్మించాడు. జువాన్ తల్లిదండ్రులకు మొత్తం 10 మంది జన్మించగా.. ఈయన తొమ్మిదో సంతానం. కాగా జువాన్ భూమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా 2022లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కారు. జువాన్ కు ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా సర్టిఫికేట్ కూడా అందించింది. ఈయన వయస్సు 2022 ఫిబ్రవరి 4 కి ఆయన 112 ఏళ్లు. ప్రస్తుతం జువాన్ 114 ఏళ్ల వయస్సులో నిన్న(ఏప్రిల్ 3) తుది శ్వాస విడిచారు. జువాన్ మరణ వార్తను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక జువాన్ కు 11 మంది పిల్లలు జన్మించగా.. 2022 నాటికి అతనికి 41 మంది మనుమలు, 30 మంది మునిమనవళ్లు ఉన్నారు.