అక్క మృతిని జీర్ణించుకోలేక తమ్ముడు ఆత్మహత్య
అక్క మృతిని జీర్ణించుకోలేక ఓ తమ్ముడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంబదూరులో మంగళవారం చోటుచేసుకుంది.
దిశ,కళ్యాణదుర్గం:అక్క మృతిని జీర్ణించుకోలేక ఓ తమ్ముడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంబదూరులో మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బాగేపల్లి రామాంజనేయులు, రామ లక్ష్మమ్మ ఒక కుమార్తె కుమారుడు సంతానం. కుమార్తె గౌతమి నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. అక్క మృతితో తమ్ముడు పవన్ (28) తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అక్క మరణాన్ని తట్టుకోలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే గుర్తించిన బంధువులు కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై పోలీసులను వివరణ అడగగా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడతామన్నారు.