మరణంలో సైతం వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో ట్విన్స్​ దుర్మరణం

వారిద్దరు ట్విన్స్​ ఒకే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చారు

Update: 2024-08-20 13:19 GMT

దిశ, ఖమ్మం రూరల్​: వారిద్దరు ట్విన్స్​ ఒకే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చారు. ఒకేసారి ఇద్దరు జన్మించడం సాధరణమే అయిన ఒకేసారి ఒకే ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందడం చాలా బాధాకరమైన సంఘటన రూరల్​ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్​ మండలం రామన్నపేట కు చెందిన అత్తునూరి నరసింహరావు హమాలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. నరసింహారావు భార్య ఇద్దరు ట్విన్స్​ మగబిడ్డలకు జన్మనిచ్చింది. వారే అత్తునూరి మహేష్​(22) అత్తునూరి నవీన్​(22)లు. వీరిద్దరు డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు వద్దే ప్రిపరేషన్​ అవుతున్నారు.

మంగళవారం మహేష్​, నవీన్​, స్నేహితుడు ముగ్గురు ఖమ్మంలో కలుసుకున్నారు. వీరు ముగ్గురు ఒకే బైక్​ పై వెళ్తుండగా మార్గమద్యలోని మద్దులపల్లి గ్రామాశివారైన మూలమలుపు వద్ద వెనుక నుంచి వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం టూవీలర్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్​, మహేష్​లు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరికి తలకు బలమైన గాయాలవడంతో రక్తపుమడుగులో చివరి శ్వాస విడిచారు. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న మరో యువకుడిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.


Similar News