నది చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-05-28 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద విషాదం చోటు చేసుకుంది. గోస్తని నది చెక్ డ్యామ్‌లో దిగి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. చెక్ డ్యామ్‌లో ఆరుగురు యువకులు ఈతకు దిగినట్లు సమాచారం. వీరిలో ముగ్గురి సురక్షితంగా ఉండగా మిగతా ముగ్గురు గల్లంతు అయ్యారు. గల్లంతైన ముగ్గురు యువకుల కోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులు విజయనగరం కంటోన్మెంట్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  


Similar News