మూడున్నర కేజీల గంజాయి పట్టివేత

మేడ్చల్‌ ప్రాంతంలోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలో కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయించడానికి తీసుకొచ్చిన మూడున్నర కేజీల గంజాయిని మేడ్చల్‌ ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

Update: 2024-06-18 14:16 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : మేడ్చల్‌ ప్రాంతంలోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలో కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయించడానికి తీసుకొచ్చిన మూడున్నర కేజీల గంజాయిని మేడ్చల్‌ ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శామీర్‌పేట మండలం దేవరయాంజల్ లో ఒరిస్సాకు చెందిన శంకర్‌ బాగ్‌, సిబాకిలా అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నారనే పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్‌ ఎస్సై ఎం.నవినీతా సిబ్బంది కలిసి పట్టుకున్నారు. ఈ గంజాయిని మేడ్చల్‌ ప్రాంతంలోని ఇండస్ట్రీయల్‌ ప్రాంతాల్లోను, ఇంజనీరింగ్‌

    కళాశాల దగ్గర అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. వారి వద్ద ఉన్న రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలను అమ్మకాలు, నిల్వ చేసిన సమాచారం ఉంటే 8712659740, 9192019684,7093755115 నెంబర్లకు ఫోన్ చేసి తెలిపాలని కోరారు. గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్‌ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్‌ పి.దశరథ్‌, డీపీఈఓ షేక్‌ పతియాజుద్దీన్‌, ఏఈఎస్‌ మాధవయ్య అభినందించారు.


Similar News