ఉచ్చులు వేసి వన్యప్రాణిని చంపిన వారు అరెస్ట్
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అమ్రాబాద్ డివిజన్
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అమ్రాబాద్ డివిజన్ పరిధిలోని అడవిలో వన్యప్రాణి అయిన కనితిని ఉచ్చుల సహాయంతో చంపివేసి మాంసాన్ని తరలించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ కేసు నమోదు చేశమని అమ్రాబాద్ అటవీ క్షేత్ర అధికారి గురు ప్రసాద్ గురువారం మీడియాకు తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అమ్రాబాద్ మండలం వంగురోనిపల్లి గ్రామానికి చెందిన పిల్లి సాయిలు, జక్క నరసింహారావు, కడారి అంజయ్యని ముగ్గురు వ్యక్తులు ఈ నెల 12న ఉచ్చుల సహాయంతో వన్యప్రాణి చంపి మాంసం తరలిస్తూ పట్టు పడ్డారు. విచారణ అనంతరం అటవీ హక్కుల చట్టం ప్రకారం వారిపై కేసు నమోదు చేసి గురువారం జైలుకు తరలించామన్నారు. నిందితులను పట్టుకుని క్రమంలో అటవీ శాఖ సిబ్బంది డిప్యూటీ రేంజర్ వాణికుమారి, ఖాజా మొయినుద్దీన్, అటవీ బీట్ అధికారులు నాగశేషం, శారద, గోపాల్, వీరయ్య, లక్ష్మణ్, కిరణ్, బాలకృష్ణ, బేసిక్ క్యాంపు వాచర్లు పాల్గొన్నారు.